బతుకమ్మ, నాగిరెడ్డిపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రైతులతో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ అనుసంధానం ద్వారా రైతులతో మాట్లాడే రైతు నేస్తం కార్యక్రమానికి నాగిరెడ్డిపేట మండల రైతు వేదికలలో రైతులు కరువయ్యారు. రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లకు అనుసంధానం చేయబడే ఈ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి గా మాట్లాడే వీడియో ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని రైతులు వీక్షించడానికి మండలంలోని మూడు రైతు వేదికలలో ఏర్పాట్లు చేశారు. కానీ వ్యవసాయ శాఖ అధికారులు మండల రైతులకు, ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో రైతు వేదికలలో ముఖ్యమంత్రి ప్రసంగించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఒక్కో రైతు వేదికలో అధికారులతో కలిపి కేవలం 20 నుండి 25 మంది వరకు రైతులు మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగాన్ని వీక్షిద్దామంటే తమకు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు కూడా సమాచారం అందించలేదని పలువురు రైతులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. దీనిని బట్టి చూస్తే మండల వ్యవసాయ అధికారుల పనితీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పవచ్చని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.
