26 C
Hyderabad

ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి

Farmers should be encouraged to shift towards crops that require less water (dryland/semi-dry crops).

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రబీ సీజన్లో రైతులను ఆదుకోవాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏ ఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పూర్ భూమయ్య,దేశెట్టి సాయి రెడ్డిలు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రైతులను వరి పంట వేయవద్దంటూ అలాగే రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని కలెక్టర్ ని కోరారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న, కుసుమ, ఆవాలు, పెసర, మినుము, శనిగలు, తదితర పంటల వైపు రైతులను ప్రోత్సహించి ఈ పంటలకు విత్తనాలు ప్రభుత్వమే  ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచితంగా, మిగతా రైతులకు 80 శాతం సబ్సిడీపై ఇవ్వాలని వారు కోరారు. ఖరీఫ్ సీజన్లో తీసుకున్న రైతుల రుణాలను వాయిదా వేసి రబి సీజన్ గాను కొత్త రుణాలు ఇవ్వాలి. అలాగే పశుగ్రాస కొరతను నీవరించడానికి గడ్డి విత్తనాలను, ధాన్యాలను 80శాతం సబ్సిడీ ఫై అందించి పాడి పశువు గొర్రె మేక రైతులను ఆదుకోవాలి అన్నారు. యంత్ర లక్ష్మీలో రైతులకు సరిపడా అన్ని రకాల యంత్రాలను 80 శాతం సబ్సిడీతో అందించాలి గ్రామాలలో ఉపాధి పనులను విస్తరించి సంవత్సరానికి ఒక మనిషికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలి అలాగే రోజుకు 700 రూపాయలు కూలి ఇవ్వాలి. ఎల్ నినో ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా  పెంచుతున్నారని వారన్నారు. గత సంవత్సరం సన్న బియ్యం కింటాల్ మీద 3000 నుండి 3500  వేలకు పెరిగినవి. రేషన్ షాపులలో ఒక్కొక్కరికి ప్రస్తుతం ఇస్తున్న ఆరు కిలోలకు బదులు ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఇవ్వాలని అలాగే బియ్యంతో పాటు ఇతర పప్పులు నూనెలు చింతపండు తదితర 12 రకాల వస్తువులను అందించి ప్రజలను ఆదుకోవాలని  ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు రైతులకు , రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కిసాన్ సమ్మన్ నిధి 12 వేలకు బదులు 20,000 రూపాయలకు పెంచాలని, అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు చెల్లించాలని వారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న సంవత్సరానికి 12,000 బకాయిలతో సహా చెల్లించాలని కరెంటును నిరంతరంగా 12 గంటల పాటు ఇవ్వాలని అన్నారు. మంచిప్ప 21 ప్యాకేజి కి తగిన నిధులు కేటాయించి సత్వారమే పనులు పూర్తి చేయాలనీ వారు కోరారు. కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న విపత్తు నిధులను కేటాయించాలి. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు  నివారణ చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి. సాయిలు, ఎల్. పర్వన్న, సహయ కార్యదర్శి  దేద వత్ బన్సీ, జిల్లా నాయకులు ఎస్. అనంతయ్య. ఎస్. విట్టల్, నర్సాగౌడ్, రాపాని గంగాధర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు  భూమయ్య, మల్లికార్జున్, శివకుమార్, జేపీ గంగాధర్,శంకర్, ఎలాప్ప, అశోక్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Farmers should be encouraged to shift towards crops that require less water (dryland/semi-dry crops).

More articles

Latest article