27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జైల్లో పెట్టిన రైతులను విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గద్వాల జిల్లా జోగులాంబ మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల గాలి,నీరు,భూమి కలుషితమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతింటాయని , ఫ్యాక్టరీ నిర్మాణం జరపవద్దన్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టారని, వెంటనే వారిపై మోపబడిన కేసులను ఉపసంహరించి జైల్లో ఉన్న రైతులను విడుదల చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం ఎన్ ఆర్ భవన్ కోటగల్లి లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ముందుగా  ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాయక్ వాడి నరసయ్య కు సమావేశంలో ఘన నివాళులర్పించారు. అనంతరం భూమయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రభుత్వం రైతాంగానికి సరిపడా అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు ఎరువులు,పురుగుమందులు, ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచితంగాను మిగతా రైతులకు 50% పై  అందించాలని ఆయన అన్నారు.రైతులందరికీ సరిపడ రుణాలు అందించాలన్నారు. మార్కెట్లో  ప్రైవేట్ విత్తనాల కంపెనీలు, నకిలీ విత్తనాలు రైతులకు అంటగడుతున్నారని ప్రైవేట్ వ్యాపారుల మోసాలకు గురికాకుండా  రైతాంగాన్ని కాపాడేందుకు అట్టి వ్యాపారులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని భూమయ్య అన్నారు.  తెలంగాణ విత్తనాభివృద్ధికి ప్రభుత్వం ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, ఈ సంస్థ ద్వారానే  రైతులకు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిల  భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు అగు ఎర్రన్న బి.సాయిలు,సహాయ కార్యదర్శి పర్వన్న,నాయకులు పోచన్న, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article