- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా, లంబడ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనీ అదేవిధంగా ఎస్టీలను క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించలేకపోతున్నారు అని ఇప్పటికైనా ఎస్టీలకు సముచిత న్యాయం కల్పించి కొరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్టీలు వెన్నుదన్నుగా నిలిచారని, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. డిప్యూటీ పదవులు కాకుండా క్యాబినెట్లో పదవులు కేటాయించి సరైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. మేము ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీ నాయకులమే అని , మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అని, మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండదండలగానే ఉన్నామని, ఉంటామని , బంజారాలకు సరైన హోదా కల్పించి మా సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, మోహన్ నాయక్, కైలాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
