27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రైతు హామీలను అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

రైతాంగ సమస్యలను పరిష్కరించాలి.
సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్

సిరికొండ, బతుకమ్మ : రైతంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ డిమాండ్ చేశారు.బుధవారం రైతంగా సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం (ఎఐపీకేఎస్) సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ తహసిల్దార్ కు మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగం ఎన్నో ప్రయాసలకు వోర్చి, పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు. గిట్టు బాటు ధర లభించడం లేదన్నారు. ఎఐపీకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి.బాబన్న మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫారస్ కమిటీ సూచనల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల రైతాంగానికి ఆకలి, అప్పులు, ఆత్మహత్యలు శరణ్యమవుతున్నాయన్నారు. రైతు కోసమే మేము చేస్తున్నాం అని మీడియాలో పెద్ద,పెద్ద ప్రకటనలు ఇస్తున్న పాలకులు ఆచరణలో మాత్రం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమయ్యారని, బడా వ్యాపారులకు, పెట్టబడుదారులకు, కార్పొరేట్ లకు అనుకూలమైన చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నారని అన్నారు. రైతు పండించే పంటలు పత్తి క్వింటాకు రూ.18500/-,మిర్చి క్వింటాకు రూ.30,000/- ,వరి క్వింటాకు రూ.3,500/-, వేరుశనగ, మొక్కజొన్నలకు క్వింటాకు రూ.25 వేల రూపాయలు ధరనిర్ణయించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోసీపిఐ (ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్.దామోదర్,ఎం .లింబాద్రి,జి.సాయరెడ్డి,ఈ.రమేష్, బి.కిషోర్ .ఎం. డి.అనీష్ .ఎస్.కిషోర్, కే.ఆశిస్ .కట్ట రాములు .నిమ్మల రాములు.ఎస్. బాలయ్య .పి రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article