23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

విధ్యుత్ చార్జీల పెంపుధలను అడ్డుకున్న బిఆర్ఎస్ పార్టి సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:     

తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడకుండా బిఆర్ఎస్ పార్టీ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఇఆర్సీని ఒప్పించి విజయం సాధించినందుకు సంబరాలు నిర్వహించారు అ పార్టి శ్రేణులు. పార్టి జిల్లా కార్యాలయంలో  బుదవారం సంబరాలు నిర్వహించి మిఠాయి లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.  అనంతరం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం పాలాభిషేకం నిర్వహించి ఆ తరువాత టపాసులు కాల్చి నాయకులు కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

BRS party celebrates blocking electricity tariff hikes

ఈ సందర్బంగా మాజీ నూడా చైర్మన్  ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలపై భారీ విద్యుత్ చార్జీలు మోపకుండా  ఈ ఆర్ సికి తమ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై పడకుండా ఆపడంలో విజయం సాధించిన  వర్కింగ్ ప్రెసిడేంట్ కేటీఆర్ కు మా మాజీ మంత్రులకు ధన్యవాదాల తెలిపారు .ఈ మీడియా సమావేశంలో దాదన్న గారి విఠల్ రావు మాట్లాడుతూ… గత పది సంవత్సరాలలో కేసిఆర్ గారు విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా కరెంటు ప్రజలకు జీవనాడిగా ముందుకెళ్లారు అని గుర్తు చేశారు.   ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేసి ఉచిత కరెంటు, పరిశ్రమలకు నిరంతర కరెంటు ఇవ్వడం వలన మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి నాలుగు రేట్లు పెరిగిందని  అట్లాగే పరిశ్రమలలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. తెలంగాణను అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు  అన్నారు. ఈ కార్యక్రమంలో… బిఆర్ఎస్ సీనియర్ నాయకులు: రామ్ కిషన్ రావు , సిర్పరాజు, సుధాం రవిచందర్, దండు శేఖర్, సత్యాప్రకష్, ఎనగందుల మురళి, నవేద్ ఇక్బాల్, నీలగిరి రాజు, తదితరులు ఉన్నారు.

 

BRS party celebrates blocking electricity tariff hikes

More articles

Latest article