ఫార్మర్ రిజిస్ట్రీ రైతులకు ఎంతో మేలు

0 14,663

రుద్రూర్, బతుకమ్మ : ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి వెంకటేష్  అన్నారు. గురువారం రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటివరకు రుద్రూర్, సిద్ధాపూర్, రాయకుర్, అక్బర్ నగర్, బొప్పాపూర్ గ్రామాలలో పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ఆధార్ నంబరుతో అనుసంధానించిన భూ యాజమాన్య వివరాలను పట్టా బుక్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు కేటాయించబడుతుందని ఈ కార్డు ఆధారంగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకాలు, మౌలిక సదుపాయాలు వంటి లబ్ది నేరుగా చేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారోబార్ మాచ్కూరి అశోక్, డ్వాక్రా సంఘాల సి ఏ పిట్ల వీరేశం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మచ్కూరి శ్రావణి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.