28.2 C
Hyderabad

ఘనంగా పెద్ద హనుమాన్ బ్రహ్మోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో వైశాఖం వాస ఉత్సవం  పురస్కరించుకొని పెద్ద హనుమాన్ బ్రహ్మోత్సవం నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో చైత్ర పౌర్ణమి రోజు జనోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నపున్నూరు గ్రామంలో వైశాఖ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేవాలయంలో మహాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ప్రవీణ్ మహారాజ్, గురుస్వాములు కన్నయ్య స్వామి, రాజు స్వామి, మారుతి స్వామి, బోదు శేఖర్, అదనపు కోర్ట్ జడ్జ్  శేష తలప సాయి, భక్తులు, నవీన్ స్వామి, ఏటీఎం శ్రీకాంత్ స్వామి, గురు స్వామి, శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

A grand Hanuman Brahmotsavam

More articles

Latest article