ఫార్మర్ రిజిస్ట్రీ రైతులకు ఎంతో మేలు
రుద్రూర్, బతుకమ్మ : ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి వెంకటేష్ అన్నారు. గురువారం రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటివరకు రుద్రూర్, సిద్ధాపూర్, రాయకుర్, అక్బర్ నగర్, బొప్పాపూర్ గ్రామాలలో పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ఆధార్ నంబరుతో అనుసంధానించిన భూ యాజమాన్య వివరాలను పట్టా బుక్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో రైతులకు ప్రత్యేక...