నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2025 -26 సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి పి హెచ్ సి (దివ్యాంగులు), సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, ఎక్సట్రా కర్క్యూలర్ ఆక్టివిటీస్) విద్యార్థిని, విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన అడ్మిషన్స్ కార్యాలయంలో రెండు రోజులుగా ధ్రువపత్రాల పరిశీలించారు. ప్రత్యేక కేటగిరి లో ఎన్ సి సి 14, స్పోర్ట్స్ 02, పి. హెచ్ సి( దివ్యాంగులు )01 ప్రత్యేక కేటగిరిలో అడ్మిషన్ పొందినారని దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి తెలంగాణ వర్సిటీ ఫిసికల్ డైరెక్టర్ డా. నేత టెక్నికల్ అసిస్టెంట్ నరేష్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు.
