- ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్
నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని, రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని మాధవ నగర్ లో గల కామ్రెడ్ నర్సన్న కాలనీలో శనివారం నిజామాబాద్ మహా సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వర్గంగా కత్తుల మారుతి, పల్ల మల్లేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి పార్లమెంటులో మెజార్టీ రైతులకు వ్యతిరేకమైన బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో మహాధర్నను నిర్వహించారని తెలిపారు. ఆ ధర్నాను దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాల నాయకులతోని చర్చలు జరిపి ఆ చట్టాలను వెనుకకు తీసుకుంటామని రైతు సంఘాల నాయకులకు హామీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైతంగం పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటికి ఆ హామీ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. మళ్లీ ఢిల్లీలో రైతంగం ఇప్పటికీ రెండు నెలలుగా ధర్నా చేస్తున్నారని తెలిపారు. హామీ ఇచ్చిన రైతు చట్టాలను వెనుకకు తీసుకుంటామని రైతుల పైన కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పి ఉపసంహరించుకోకపోవడంతోనే మళ్లీ రైతులు ధర్నాకు దిగారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కామెడీ ఉప్పలయ్య, తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు ఈర్ల పైడి, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బామండ్ల రవీందర్, పంజాల నరసింహులు, రాపాక సత్యనారాయణ, కొండ అనూషవ్వ, షేకు రజియా బేగం, గారబోయిన శంకర్, మాటూరి కనకయ్య, అల్లే నరసింహులు, రైతులు కూలీలు మహిళలు పాల్గొన్నారు.
