నిజామాబాద్, బతుకమ్మ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ లోని విద్యానగర్, మార్క్స్ భవన్ లో శనివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎం.సుధాకర్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్లుగా ఉమ్మడి జిల్లా నుండి బి.ఈశ్వరి, శశికళ, హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యులుగా సుమలత, సునీత ఎన్నికయ్యారన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. వీక్లీ ఆఫ్ అమలు చేసి, పని భారం తగ్గించాలన్నారు. మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా, పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెగ్యులరైజ్ చెయ్యాలన్నారు. కేజీబీవీ సర్వీసుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు.