27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏబీవీపీ ఖేలో భారత్ ఉత్సవ్ క్రీడా పోటీలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏబీవీపీ ఇందూర్ శాఖ  ఖేల్ భారత్ ఉత్సవ్ క్రీడా పోటీలను శనివారం నగరం లోని గిరిరాజ్ కళాశాలలో నిజామాబాద్ అర్భన్ ధన్పాపాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.  ఈ సందర్భంగా  ఎమ్మెల్యే, ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ రేంజర్ల నరేష్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహించే ఖేలో భారత్ ఉత్సవాలు స్వామి వివేకానంద 162వ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల కోసం సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. అదే విధంగా ఇందూర్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో రెండు విభాగ్ ల సంఘటన మంత్రి రాజు సాగర్, గిరి రాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ ,  జిల్లా కన్వీనర్ ప్రవీణ్, నగర అధ్యక్షులు గొడుగు వెంకటకృష్ణ, ఇందూరు విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ దామ సుమన్ ,నగర కార్యదర్శి బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపి, దుర్గా దాస్ , మహేష్, ప్రీతం, గణేష్, రాజ్ గణేష్ గారు, శ్రీశాంత్ , రాజు, తదితరులు పాల్గొన్నారు.

ABVP Khelo Bharat Utsav sports competitions begin

More articles

Latest article