24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కాల్ మనీ వేధింపులకు తండ్రీకూతురు బలి..?

Must read

📰 Generate e-Paper Clip

. గోదావరిలో దూకిన కుటుంబం

 . తండ్రి, కూతురు గల్లంతు

. ఒకరిని కాపాడిన జాలర్లు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అందులో తండ్రి, కుతురు గల్లంతు కాగా భార్యను స్థానిక జాలర్లు కాపాడారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది. భాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డు కు చెందిన వేణు, అనురాధ దంపతులు తమ అవసర నిమిత్తం ఇద్ధరు వ్యక్తుల వద్ధ రూ.3 లక్షలు అప్పుగా తీసుకుని వడ్డీతో సహా చెల్లించారు. కానీ వడ్డీ వ్యాపారులు వికాస్, రోషన్ అదనపు వడ్డీ కోసం వేధించారు. అక్కడితో ఊరుకోకుండా వారి కూతురు పూర్ణిమతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో కుటుంబం మొత్తం బుధవారం ఉదయం గోదావరిలో దూకి ఆత్యహత్యాయత్నం చేసింది. వేణుతోపాటు అతడి కూతురు పూర్ణిమ గల్లంతు కాగా అనురాధను స్థానిక జాలర్లు కాపాడారు. తండ్రీకూతురు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Family victim of call money harassment..

More articles

Latest article