29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

. టీఎన్జీవోస్ నూతన అధ్యక్షుడు నాశెట్టి సుమన్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఉద్యోగుల శ్రేయస్సే తమ లక్ష్యమని టీఎన్జీవోస్ జిల్లా నూతన అధ్యక్షుడు నాశెట్టి సుమన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్(టీఎన్జీవోస్) భవన్ లో బుధవారం సుమన్ తోపాటు సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు బాధ్యతలు చేపట్టారు. యూనియన్ పూర్వ అధ్యక్షుడు, టీజీవో ప్రస్తుత అధ్యక్షుడు అలుక కిషన్ సుమన్ ను అధ్యక్షుడి కుర్చీలో కూర్చబెట్టారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన పెద్దలకు రుణపడి ఉంటానని, వివాదాలకు తావులేకుండా టీఎన్జీవోస్ ను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ రాష్ర్ట, జిల్లా నాయకత్వానికి, సీనియర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Employee welfare is the goal

More articles

Latest article