- ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్
ఆర్మూర్, బతుకమ్మ : వినయ్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడిన తొమ్మిది నిమిషాల సంభాషణ.. తన వద్ద ఉందంటూ రాకేశ్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వినయ్ రెడ్డి జీవన్ రెడ్డితో 9 సెకండ్లు కూడా మాట్లాడలేదన్నారు. ఇరువురి సంభాషణ ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వినయ్ రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడన్నారు. నారా లోకేశ్‌ను రాకేశ్‌రెడ్డి ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ విట్టం జీవన్, పండిత్ పవన్, కొంతం మురళి, భూపేందర్, చిట్టి రెడ్డి, మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.