25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫెయిల్యూర్ సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • అందాల పోటీలు కాదు ఫెయిల్యూర్ సీఎంల పోటీ పెట్టండి
  • 17నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు రూ.లక్షా 60వేల కోట్లు
  • ధాన్యం కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించండి
  • ఇప్పటికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీడీపీ నిధులివ్వాలె
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టడం కాదు ఫెయిల్యూర్ సీ ఎం ల పోటీ పెడితే దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ సీ ఎం రేవంత్ రెడ్డికి వస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్ పల్లి మండలంలోని కొనసముందర్ పీ ఏ సీ ఎస్ గోడౌన్, అమీర్ నగర్ పీ ఏ సీ ఎస్ గోడౌన్, డీ సీ తాండ ఎస్టీ కమ్యూనిటీ హాల్, ఉప్లూర్ పీ ఏ సీ ఎస్ ఆఫీస్  పనులను రాజ్యసభ సభ్యుల ఎమ్మెల్సీ నిధులతో నిర్మించిన  పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న సీ ఎం రేవంత్ రెడ్డి కి వరి కొనుగోలుపై రివ్యూ చేయడం లేదేమని ప్రశ్నించారు.జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల పంట పడితే 10 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయాల్సిన అంచనా పెట్టుకుంటే  9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయన్నారు. సన్న వడ్లు తీసుకోవడంలో రైస్ మిల్లర్లు  నిరాసక్తత చూపించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని,9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్ లకు వస్తే 6 లక్షల 95 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయంటే 20 శాతం ధాన్యం జోకకుండా కల్లాల్లోనే  ఉందిని అర్థమన్నారు. లారీలల్లో 6 ,94,000 మెట్రిక్ టన్నులు లోడ్ చెసి రైస్ మిల్స్ కి పంపించగా 5,56,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆన్ లోడ్ చేశారని, ఇంకా 1 లక్ల 38 వేల మెట్రిక్ టన్నులు లారీలల్లో నే ఉన్నాయన్నారు. రైస్ మిల్లర్లు దించుకోవడం లేదని ఎమ్మెల్యే అన్నారు.జిల్లాలో ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నులు తరుగు కింద తీసేసారని,ఒక క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తున్నారని తెలిపారు. లారీలల్లో ధాన్యం అన్ లోడ్ చేయాలని,కల్లాల్లో ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వడ్లకు దేశ వ్యాప్త డిమాండ్ ఉందని అధికార యంత్రాంగం వెంటనే కొనుగోలు చేసి, తరుగును అరికట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని  ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.రైతుల కంటే అందాల పోటీలపైనే రేవంత్ రెడ్డి కి ఆశక్తి ఉందిని ఆయన ఎద్దేవా చేసారు. స్కూల్ పిల్లలకు అందాల పోటీలు చూపించాలి అని సీ ఎం చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి అంటే నన్ను కోసుకొని తినుమంటున్న రేవంత్ ముఖ్యమంత్రిగా అనర్హుడని అన్నారు. పరిపాలన చేతకాకపోతే  దిగిపోవాలని, మీ పార్టీలో   శ్రీధర్ బాబు, ఉత్తమ్, బట్టి లాంటి నీకన్న అర్హులు ఉన్నారు అని ఎమ్మెల్యే అన్నారు. అధిష్టానం వెంటనే రేవంత్ ను దించాలని లేకుంటే మరో 20 ఏండ్లు కాంగ్రెస్ ఖతం కావడం ఖాయం అని రాహుల్ గాంధీ కి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి లెక్కలేని హామీలు ఇచ్చాడని, ఆర్రాస్ పాడినట్లు హామీలు చదివి,ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చలేదని సమర్శించారు. అరకొర రైతు రుణమాఫీ, బోనస్ ఎగవేత, రైతు బంధు సరిగా లేదన్నారు. మహిళలను మోసం చేశారని,రూ. 2500 ఇవ్వలేదని,తులం బంగారం ఎగ్గొట్టారని, రూ. 4 వేల పింఛన్ రాలేదని, రూ. 5 లక్షల విద్యా భరోసా ఇవ్వలేదని, స్కూటీలు జాడ లేదని.రేషన్ కార్డు ఊసే లేదని, కొత్త పింఛన్ ముచ్చట లేదని  ఎమ్మెల్యే విమర్శించారు. ఈ సీజన్ మొదలై 40 రోజులైన ఇప్పటికి  ఒక్క రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదన్నారు. వెంటనే క్వింటాలుకు  రూ. 500 బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అప్పులు చేసి, 24 గంటల ఉచిత విద్యుత్తు,కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరత ద్వారా ఇంటింటికి నీరు, సెక్రటేరియట్,33 కలెక్టరేట్లు, 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం,అమరవీరుల స్తూపం,33 మెడికల్ కాలేజీలు,హాస్పిటల్స్, రైతు బంధు ఇలా అనేక అభివృద్ధి పనులు చేసాడని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించాడని తెలిపారు.కేవలం 17 నెలల్లో రూ.1లక్ష 60 వేల కోట్ల అప్పు రేవంత్ చేశాడని తెలిపారు.  అప్పులు చేసి ఢిల్లీకి మూటలు పంపిస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క ఇటుక పెట్టి అభివృద్ధి పని అన్న చేశావా  అని ప్రశ్నించారు. కాగ్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు వడ్డీ కలిపి కట్టింది రూ.34 వేల కోట్లు మాత్రమేనని,నువ్వు చేసిన అప్పులో అసలు వడ్డీ కట్టగా మిగిలిన రూ.1,20,000 కోట్లు ఎం చేసావని వేముల ప్రశ్నించారు. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలతో  కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారన్నారు. కోసుకొని తినుండ్రి, చెప్పులు ఎత్తుక పోయేవాళ్ళ లెక్క చూస్తుండు,నన్ను ఎవడు నమ్ముతలేడు, రాష్ట్రం దివాళా తీసింది అని చెప్పే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని వెంటనే మార్చాలని లేని పక్షంలో కాంగ్రెస్ సమాధి కావడం ఖాయం అని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన మాజిలు ఎంపీ సంతోష్ కుమార్ సురేష్ రెడ్డిలకు,మాజి ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 17 నెలల నుండి ప్రతిపక్ష ఎమ్మెల్యే లకు సీ డీ పీ నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రజలు, రైతులు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గా నన్ను కోరడం తో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే సీ డీ పీ నిధులు ఇవ్వకపోవడం తో మాజి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి,మాజి ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లను అడగడంతో వారు వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీ డీ పీ నిధులు కేటాయించకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను ,ఇచ్చిన హామీలపై అనేక వేదికల్లో నేను ప్రశ్నిస్తుండటం తో నాకు నిధులు ఇవ్వడం లేదన్నారు. నిధులు ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటానని ఎమ్మెల్యే అన్నారు.

  • ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి..

ఉగ్రవాదం అంతం కావాల్సిందే భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పోరాటానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను. ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్న ఏ దేశంలో ఉన్న ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేది తప్ప లాభం చేకూర్చేది కాదు. ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించే ప్రపంచ శక్తులన్ని ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయని ఆయన తెలిపారు.

More articles

Latest article