- నిర్లక్ష్యపు వైద్యులపై చర్యలు చేపట్టాలి
- ప్రగతిశీల యుజన సంఘం (పీవైఎల్ )జిల్లా అధ్యక్షులు అనిస్
సిరికొండ, బతుకమ్మ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న వైద్యులు,అధికారుల పై చర్యలు తీసుకోవాలని,జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రిలో రోగులకు అన్ని వసుతులు కల్పించి, మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యుజన సంఘం (పీవైఎల్)జిల్లా అధ్యక్షులు అనిస్ డిమాండ్ చేశారు.
సోమవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం పోతే అసలు వైద్యం అందలేని పరిస్థితి నెలకొన్నదని, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉన్నతాధికారులు అ వీటిపై దృష్టి సారించి పరిస్థితులను మెరుగుపరచాలని ఆయన కోరారు . రెండు రోజుల క్రితం ఒక మహిళ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఆమెను తీసుకపోవడానికి కనీసం స్టేచర్ లేక ఆమె భర్త భుజాల మీద మోసుకెళ్లిన దుస్థితి నెలకొన్నది అన్నారు. సరేనా వైద్యం లేక , సరైన మందులు లేక ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే రోగులు జంకే దుస్థితి నెలకొంది అన్నారు. వైద్యుల దుర్మార్గమైన నిర్లక్ష్యం కారణంగా రోగులు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.సూపరిండెంట్ మేడం బర్త్డే సెలబ్రేషన్ ఆస్పత్రిలోనే ,ఫంక్షన్ హాల్ లో నిర్వహించినట్లుగా వైద్యులు నిర్వహించడం సోచనీయమన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వైద్యులు ఉన్నా జిల్లా వైద్య అధికారులు జిల్లా అధికారులు చోద్యం చూస్తున్నారు అన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తాం అని ఆయన హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్ ) జిల్లా నాయకులు ఏ.హారిష్, మండల నాయకులు బి.అరుణ్,బి.మహి తదితరులు పాల్గొన్నారు.
