స్నేహ సొసైటీలో ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు సేవ తాత్పర్యం, మతసామరస్యం అనేది అలవర్చుకోవడం ఏసుప్రభు జన్మవృత్తాంతమని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, సీఎస్ఐ పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ పేర్కొన్నారు. అన్ని గ్రంథాల్లో కూడా ఉండేది ఒకటే సారాంశం సేవ తాత్పర్యం, మరొకరికి సహాయం చేయడం మాత్రమేనని వారు తెలిపారు. దివ్యాంగ విద్యార్థులు ఏసుప్రభు జన్మదినం గురించి కళ్లకు కట్టినట్టుగా చూపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో సపోస్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, సీఎస్ఐ పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పుట్టుక గురించి దివ్యాంగ విద్యార్థులు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. అనంతరం విద్యార్థుల మధ్య సపోజ్ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన అని ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా త్యాగం చేశారని తెలియజేశారు. స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సిద్దయ్య, జ్యోతి లు దివ్యాంగులను ప్రతి ఒక్కరిని చేరువ చేసుకొని వారి అభ్యున్నతికి కృషి చేయడం వారి పూర్వజన్మ సుకృతమని కొనియాడారు. దివ్యాంగ విద్యార్థులతోపాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయ సిబ్బందిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉంటాయని తెలియపరిచారు. దివ్యంగా విద్యార్థుల మధ్య కుల మతాలకతీతంగా మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్క పండుగను విద్యార్థుల మధ్య జరపడం వారిలో అందరం ఒక్కటే అనే నినాదం అలవర్చడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ప్రతి ఒక్కరు కుల మతాలకతీతంగా సేవాభావాన్ని అలవర్చుకొని మరొకరికి సహాయం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య,ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి యూట్యూబర్ వెంకటేశ్వర్ రావు, శ్రీధర్, బ్రహ్మయ్య దివ్యంగుల పాఠశాలల సిబ్బంది విధార్థులు తదితరులు పాల్గొన్నారు.

