31.5 C
Hyderabad

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా పోతన కర్ లక్ష్మి నారాయణ

Pothana Kar Lakshmi Narayana as Chairman of Nizamabad Red Cross Society

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా పోతన కర్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. సోమవారం రెడ్ క్రాస్ బిల్డింగ్ లో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారి,డీసీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా డాక్టర్ శీను నాయక్, కోశాధికారిగా కెంపుల నాగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా జెస్సు అనిల్ కుమార్ లని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆదివారం రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.15 మంది సభ్యుల మెజారిటీ ఓట్లు ద్వారా ఎంపిక కాగా వారిలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోసైటి నూతన ఎన్నికైన సభ్యుల చేత ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు దికొండ యాదగిరి, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, బుస్సా ఆంజనేయులు, నరాల సుధాకర్, కొండ సత్య ప్రసాద్, కరిపె రవిందర్, యెండల సుధాకర్, చౌహన్ బాలజీ, పద్మ సుభాష్, అబ్బాపూర్ రవీందర్, బి రంజిత్ లు ఉన్నారు.

Pothana Kar Lakshmi Narayana as Chairman of Nizamabad Red Cross Society
Pothana Kar Lakshmi Narayana as Chairman of Nizamabad Red Cross Society

More articles

Latest article