28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

 ఏడంతస్తుల మేడలో అన్నీ సమస్యలే..

Must read

📰 Generate e-Paper Clip

  • సమస్యల చిట్టాతో ఆరోగ్యశాఖ మంత్రికి స్వాగతం పలకనున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
  • లీకేజ్ డ్రైనేజ్ నీటి వ్యవస్థతో రోగులకు ఇబ్బంది
  • పలు డిపార్ట్మెంట్లో పర్మినెంట్ వైద్యులు లేక మెడికల్ స్టూడెంట్స్ తోనే వైద్యం
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాకతో జిజిహెచ్ వైద్య సిబ్బందితో సమీక్షించిన బోధన్ ఎమ్మెల్యే

 నిజామాబాద్ సిటీ, బతకమ్మ : ఆదివారం జిల్లా కేంద్రంలో మాత శిశు సంరక్షణ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ యూనిట్లను  ప్రారంభించడానికి రానున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ కు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సమస్యలతో స్వాగతం పలకనున్నాయి. ప్రతిరోజు 2000 పైగానే అవుట్ పేషెంట్లు వివిధ వైద్య చికిత్సల కోసం జిల్లా నలుమూలల నుండి కాకుండా వైద్యం కోసం సరిహద్దు ప్రాంతాల నుండి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు.

There are all problems in the seven-storey floor.

అయితే ఈ ఆస్పత్రిలో మాత్రం సరైన వైద్య సదుపాయాలు లేక వైద్యం కోసం వచ్చిన రోగులు నానా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఎదురవుతుంది.  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం కోసం 12 డిపార్ట్మెంట్లు ఉండగా అందులో ప్రొఫెసర్లు, డాక్టర్లు పర్మినెంట్గా విధులు నిర్వహించేవారు కొందరు మాత్రమే ఉండడంతో పేద రోగులు లక్షలు వెచ్చించి ప్రవేట్ ఆసుపత్రిల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

There are all problems in the seven-storey floor.

ఆసుపత్రి నిర్మించి 14 ఏళ్లకు పైనే అవుతున్న ఇప్పటికీ ఫుల్ టైం ప్రొఫెసర్లు, వైద్యులు లేక వైద్యం కోసం వచ్చే రోగులకు నామమాత్రం చికిత్స నే అందిస్తున్నారు. దీంతో మెడికల్ కళాశాల స్టూడెంట్స్ తోనే వైద్యం అందించాల్సిన పరిస్థితి. ఇక ఏడంతస్తుల అద్దాల మేడలో అన్ని సమస్యలే. పైనుండి కింది వరకు నీరు లీకేజ్ అవడం వల్ల ఆసుపత్రి గోడలన్నీ మురుగు నీటితో పాకురుమయమయ్యాయి. అవే నీరు కిందికి పడడంతో కింద డ్రైనేజీ నీరు పారడం వల్ల ఆ దారి గుండా వెళ్లే  వారు కొత్త వ్యాధులతో ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి

There are all problems in the seven-storey floor.

ఎదురవుతుంది. ఆదివారం జిల్లాకు మంత్రి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం జిల్లా ఆస్పత్రి వైద్యులతో సూపరిండెంట్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. పదేళ్లుగా  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోగా తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యమే కాకుండా ఇక్కడి వైద్యులు కూడా  ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. తెలంగాణలోనే వైద్య సదుపాయంలో మెరుగైన వైద్యం అందించే విధంగా ఇక్కడ పని చేసే వైద్యులు సిబ్బంది పనిచేయాలన్నారు. కాగా కొన్ని డిపార్ట్మెంట్లలో  అలసత్వం ఉందని ఎందుకు ఉండవు తనకు తెలపాలని సంబంధిత శాఖల అధికారులకు జి జి ఎచ్ సూపర్డెంట్ కు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చే  పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.

There are all problems in the seven-storey floor.

More articles

Latest article