శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

0 8,599

 

. . . నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

రుద్రూర్, బతుకమ్మ :

 

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సి కాలనీలో ఆదివారం రోజున ఓ మహిళా న్యాయవాది పై, ఓ వర్గం పై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో న్యాయవాది మహిళ, ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంగా సోమవారం రుద్రూర్ గ్రామంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై కాలనీవాసులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపి సాయి చైతన్య మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. సీపి వెంట బోధన్ ఎసిపి శ్రీనివాస్, సీఐ కృష్ణ,  ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.