26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళా న్యాయవాది పై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేసు పై పోలీసుల నిర్లక్ష్యం

 

. . . పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదుల ధర్నా

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహిళా న్యాయవాది పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్ సి కాలనీలో ఆదివారం ఓ నలుగురు వ్యక్తులు అకారణంగా ఓ వ్యక్తి పై దాడి చేస్తున్నప్పుడు ఆ సంఘటన చూసిన మహిళా న్యాయవాది వారు చేస్తున్న దాడిని ప్రశ్నించగా, ఆమె న్యాయవాది అని తెలిసి కూడా మరో వర్గానికి చెందిన వ్యక్తులు మహిళ న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని,  ఈ దాడిని నిరసిస్తూ సోమవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు ధర్నా నిర్వహించారు.

 

Those who attacked the female lawyer should be punished immediately.

ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. ఓ మహిళా న్యాయవాదిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ కృరత్వంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారన్నారు. తన పై జరిగిన దాడి పై ఆ మహిళ న్యాయవాది పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా, ఈ కేసు పై ఎస్సై, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ, ఆ దరఖాస్తులో ఉన్న పదాలను తీసివేసి, ఆగమేగాల మీద వేరే పదాలను జోడించి ఆ దరఖాస్తును కోర్టుకు పంపించారన్నారు. ఓ మహిళ కు న్యాయం జరగాల్సింది చూడగా, పోలీసులు మాత్రం నిందితులకు సహకరిస్తున్నారని, ఇలా నిందితులకు సహకరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. న్యాయవాది మహిళపై దాడికి పాల్పడిన వారి పై నాన్ బెయిల్ సెక్షన్ లు అమలు చేసి, వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని,  డిమాండ్ చేశారు. మహిళా న్యాయవాదికి న్యాయం జరగని పక్షంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కేసు విషయంలో నిందితులను శిక్షించి, మహిళా న్యాయవాదికి న్యాయం చేస్తామని సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న వారికి నచ్చజెప్పడంతో వారు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article