నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవిని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కోర్టు న్యాయవాదుల సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో న్యాయవాద ప్రతినిధులు మాణిక్ రాజ్, సుజిత్, రెంజర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
