ఈ పాఠశాలలో ప్రతీ గోడ పాఠం చెబుతోంది

మోర్తాడ్, బతుకమ్మ: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ చదువులకు తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న  ఉపాధ్యాయులు కొత్తగా ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని తెలుపడంలొ తన సందేహం లేదు. మోర్తాడ్ మండలంలోని షేట్ పల్లీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థికి అక్కడ ఉన్న  ప్రతి గోడ విద్యార్థులకు పాఠం చెప్పే విధంగా పాఠశాల గదుల గోడలను తీర్చిదిద్దినారు. తరగతి గదిలో ఉన్న బ్లాక్ బోర్డ్ చుట్టూ అక్షరాలతో అందంగా పదాలు వచ్చేవిధముగా రంగు రంగు కాగితాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గదిలో...