ధాన్యం కాంటా అయిన వారం రోజులకు రాని లారీలు
బస్తాకు 5 కిలోల తరుగు వస్తుందని రైతుల ఆవేదన
కోటగిరి, బతుకమ్మ : కోటగిరి మండల కేందంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎత్తోండ గ్రామనికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎత్తోండ గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తుందన్నారు.. కొనుగులు కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగ్స్ లేకపోవడం, హమాలీల కొరత, ధాన్యం కాంటా అయినా వారానికి కూడా లారీలు రాకపోవడంతో బస్తాకు ఐదు కిలోల తరుగు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సహకార సంఘానికి తాళం వేసిన అధికారుల తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్ వచ్చి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ సునీల్ ఘటనా స్థలానికి చేరుకొని రైతుల సమస్యను తహసీల్దార్ గంగాధర్ కు ఫోన్ లో వివరించారు. రైతులు ఆందోళన విరమించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
సమస్య వెంటనే పరిష్కరిస్తాం : తహసీల్దార్ గంగాధర్
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ రైతులతో సమావేశమై కొనుగోలు కేంద్రంలోనీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వెంటనే ఉన్నతాధికారులకు సమస్య తీవ్రతను వివరించారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో అగ్గు హన్మంతు, జగదీష్, శ్యామ్, దశరథ, శంకర్, అన్వార్, జలయ్య, సాయిలు, నర్సింలు, పెద్ద హన్మంతు, అల్లాద్దీన్, మలవ్వ తదితరులు పాల్గొన్నారు.

