ఇసుక మేటలు తొలిగించేందుకు ఎస్టిమేట్ చేయండి

0 15,265
  • ఎంపిడీఓ గంగుల సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో పెట్టిన ఇసుక మేటలను తొలగించేందుకు ఈ. జీ. ఎస్ లో చేయాల్సిన పనులను వెంటనే ఎస్టిమేట్ చెయ్యాలని సంబంధిత ఈ. జీ. ఎస్ అధికారులు, సిబ్బందిని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో  మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనుల గురించి మండల అగ్రికల్చర్ అధికారి, ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో 124 మంది రైతుల భూములలో సుమారు 85 ఎకరాలలో ఇసుక మెటలు వేసినాయని అగ్రికల్చర్ అధికారులు  నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా ఉపాధి హామీ పథకంలో వెంటనే అంచనాలు తయారు చేసి పనులు ప్రారంభించాలన్నారు. అగ్రికల్చర్ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది ఉమ్మడి సర్వే చేసి వాస్తవస్థితిగతులను నివేదిక ఇవ్వాలని ఆయన తెలిపారు. రైతుల నుండి వారి అంగీకారం తీసుకొని పనులు ప్రారంభించాలని, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ అధికారి లావణ్య, ఉపాధి హామీ ఏపీవో జీ నర్సయ్య, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.