హైదరాబాద్, బతుకమ్మ :
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ మినహ అన్ని కమిటీలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రద్దు చేశారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా కేసిఆర్ బిఆర్ఎస్ రాష్ట్ర కమిటి మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు త్వరలో అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు.
