27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంజనీరింగ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల – 2026 మొదటి సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ ఉపకులపతి టి.యాదగిరిరావు విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరమే ప్రారంభమైన ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, బిటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కొనసాగుతున్నాయి. ఈ కోర్సుల ఫలితాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో 56 విద్యార్థులకు గాను 32 మంది ఉత్తీర్ణులై 57.14% ఉత్తీర్ణతను సాధించారు. బిటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో 15 మంది విద్యార్థులకు గాను 9  మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 60 శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.సంపత్ కుమార్, డా.నందిని, డా.భ్రమరాంబిక, డా.శాంతాబాయి, అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.టి.సంపత్ పాల్గొన్నారు.

More articles

Latest article