ఇంజనీరింగ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల - 2026 మొదటి సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ ఉపకులపతి టి.యాదగిరిరావు విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరమే ప్రారంభమైన ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, బిటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కొనసాగుతున్నాయి. ఈ కోర్సుల ఫలితాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో 56 విద్యార్థులకు గాను 32 మంది ఉత్తీర్ణులై 57.14% ఉత్తీర్ణతను సాధించారు. బిటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...