ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ సెక్రెటరీ యోగితా ఉత్తర్వులను జారీ చేసింది. ఈఏడాది నుంచి బీటెక్ (సీఎస్ఈ), బీటెక్ (సీఎస్ఈ- ఏఐ), బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీటెక్ డేటా సైన్స్ కోర్సుల కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులు ఉంటారు. కాగా, తెయూలో ఇంజినీరిగ్ కోర్సులకు అనుమతించిన ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.
