29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపాధి కూలీలకు రోజుకు రూ. 600 చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకెయుఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : ఉపాధి కూలీలకు 200 వందల రోజులు ఉపాధి కల్పించి ఎలాంటి కొలతలు లేకుండా రోజుకు కూలీలకు రూ. 600 కూలిని అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ కె యు ఎస్)జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని దమన్నపేట గ్రామంలో ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఎలాంటి కొలతలు లేకుండా పనులు చూపించేవారు,ఎండాకాలం చెరువులలో మట్టి తీయించి రైతులకు సప్లై చేసేవారు ,కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కొలతలు మారి రాళ్ల మధ్యలో గుట్టల మీద పనిచేయిస్తున్నారని ఆరోపించారు. కొలతల పద్ధతి పెంచి కూలీలను పనికి దూరం చేస్తున్నారన్నారని, ఉపాది హామీ పనులకు రూ. 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, కొత్త వాళ్లకు జాబు కార్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ. 20 వేల  జీతం పెంచి ఇవ్వాలని, రోజువారి పెట్రోల్ ఖర్చులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏం శ్రీనివాస్ ఏ ముత్తన్న కూలీలు పాల్గొన్నారు.

More articles

Latest article