27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళను పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కోనాపూర్​ గ్రామానికి చెందిన మహిళ పసిబిడ్డతో శనివారం పట్టణంలోని కల్కి చెరువుకు వచ్చింది. నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు గమనించి ఆమెను కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కౌన్సిలింగ్​ ఇచ్చిన వారిలో ఏఎస్సై విజయ్​, కానిస్టేబుళ్లు ప్రవీణ్, సౌజన్య, నవీన్, అంజయ్య శ్రీనివాస్ ఉన్నారు.

More articles

Latest article