- వృద్ధుడిపై దాడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించినందుకు వృద్ధుడిపై దాడి చేసిన ఘటన నగరంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్నన్ సాహెబ్ దుకాణం పక్కన ఆగి ఉన్న ఐచర్ వాహనం మామిడి కాయలు, క్యారెట్లను వాహనంలోకి లోడ్ చేస్తున్నారు. వాహనం ఫొటోలు తీసి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీకి అబ్దుల్ మన్నన్ అనే వృద్ధుడు పంపాడు. దీంతో ఆయన వెంటనే అక్కడికి ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను పంపించాడు. అక్కడి చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఏ వాహనం నిలుపొద్దని మన్నన్ ను హెచ్చరించారు. దీంతో కోపానికి గురైన అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలీం అతని కుమారులు మన్నన్ సాహెబ్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అబ్దుల్ సత్తార్ అతని కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

