27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సామ్రాట్ అశోక విజయదశమి ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సామ్రాట్ అశోక చక్రవర్తి విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామ్రాట్ అశోకుని చిత్రపటాలు చెతులో పట్టుకోని ఆయనకు గౌరవాంజలులు సమర్పించారు.ఈ సందర్బంగా వక్తలు  కోమిరె శ్రీధర్ మాట్లాడుతూ అశోకుడు భారత చరిత్రలో మహానుభావుడిగా నిలిచారని, కాళింగ యుద్ధం అనంతరం బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి శాంతి, అహింస, సమానత్వ భావనలను సమాజానికి అందించారని పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు చూపిన మార్గమే అశోకుని జీవితాన్ని మార్చిందని గుర్తు చేశారు. ఇంకా  కోమిరె రమేష్  మాట్లాడుతూ బుద్ధుని బోధనలు, అశోకుని ఆలోచనలు, అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని, యువత వీరిని స్ఫూర్తిగా తీసుకొని శాంతి, సౌహార్ద్రం, సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగభుషన్, న్యావనంది బాబు, సిఎచ్ గంగాధర్, నల్ల రవి,మోత్కు భుమన్న, మస్త ఉపేంధర్, మామిడి రాజు, స్ధానిక యువత తదితరులు పాల్గొన్నారు.

Emperor Ashoka's Vijayadashami celebrations

More articles

Latest article