సామ్రాట్ అశోక విజయదశమి ఉత్సవాలు

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సామ్రాట్ అశోక చక్రవర్తి విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామ్రాట్ అశోకుని చిత్రపటాలు చెతులో పట్టుకోని ఆయనకు గౌరవాంజలులు సమర్పించారు.ఈ సందర్బంగా వక్తలు  కోమిరె శ్రీధర్ మాట్లాడుతూ అశోకుడు భారత చరిత్రలో మహానుభావుడిగా నిలిచారని, కాళింగ యుద్ధం అనంతరం బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి శాంతి, అహింస, సమానత్వ భావనలను సమాజానికి అందించారని...