- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, బతుకమ్మ : గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో బోధన్ పట్టణానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ప్రజలకు మీరు గాలి తర్వాత అవసరమైనది విద్యుత్ నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. అచన్పల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధన్ పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఆచనిపల్లిలో ఆవశ్యకతను మంజూరు చేయించామని తెలిపారు. రూ.2.21 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 యూనిట్లు గృహ విద్యుత్తుకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో జాడీ జమాల్పూర్ సాలూరు మండలం, హనుమాన్ ఫారం నవీపేట్ మండలానికి మంజూరు చేశామని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందల పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ నీటిలో మునిగిపోయిన గాని విద్యుత్ అధికారులు ఉద్యోగులు కార్మికులు త్వరితగతిన విద్యుత్ సరఫరా పునరుద్ధరించినందుకు అభినందించారు. కొత్తగా నిర్మించబోయే విద్యుత్ ఉపకేంద్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ అమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఎస్ ఇ రాపల్లి రవీందర్ డి ఈ బోధన్ మమ్మద్ ముక్తార్, డి ఈ కన్స్ట్రక్షన్ వెంకటరమణ, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడిఈ నగేష్ కుమార్, ఏఈ సుమిత, టౌన్ ఏ ఈ నాయిని కృష్ణ ,వినోద్, ఏ సి పి శ్రీనివాస, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, ఎమ్మార్వో విట్టల్, శరత్ రెడ్డి, పులి శ్రీనివాస్, పాషా బాయ్, గంగా శంకర్, దామోదర్, అచన్పల్లి గ్రామస్తులు సిబ్బంది పాల్గొన్నారు.
