27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎడిఇ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టివేత

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ చేసిన పనుల  తాలూకు బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ ఎడిఇ( ఆపరేషన్) ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్  విద్యుత్ శాఖ డివిజన్ లో ముద్ధం రమణ రెడ్డి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. తన పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్  రూ.3,12,882 బిల్లుల తాలూకు క్లియరెన్స్ కోసం రూ.25 వేలు  లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఎసిబిని ఆశ్రయించగా శుక్రవారం రమణ రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుబడ్డారు. ఎడిఇ రమణ రెడ్డిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హజరు పరిచారు.

More articles

Latest article