- జిల్లా అధ్యక్షులుగా దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ మేరకు నూతన కార్యవర్గ ఎంపిక ప్రకటనను విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ ల అనుమతితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు పాటుపడే వారని పాత కొత్త కలయికలతో నూతన కార్యవర్గంలో చోటు కల్పించినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నక్క రాజేశ్వర్, రాంచందర్, బంటు రాము, పోతుగంటి సురేందర్, ప్రమోద్ కుమార్, పాలెపు రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతంకార్ లక్ష్మీ నారాయణ, నిమ్మల శ్రీనివాస్ రెడ్డి, నాగోల్ల లక్ష్మీ నారాయణ, జిల్లా కార్యదర్శిగా సంగం అనిల్, నోముల నర్సారెడ్డి, పోల్కం వేణు, ధర్పల్లి జ్యోతి, రాధ, సవిత, ట్రెజరర్ గా చింతకింది శ్రీనివాస్ రెడ్డి, ఆఫీస్ సెక్రెటరీగా బద్దం కిషన్, సోషల్ మీడియా ఇంచార్జీగా శ్రీధర్ కురేల్ల, మీడియా కన్వినర్ గా పుట్ట వీరేందర్, ఐటీ ఇంచార్జీగా పిల్లి శ్రీకాంత్ లను ఎన్నుకున్నారు.
- కార్యవర్గ కూర్పులో ఎంపీ అరవింద్ మార్క్..
బీజేపీ జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ఎంపికలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మార్క్ స్పష్టంగా కనబడింది. పాత, కొత్త కార్యవర్గం సభ్యుల కలయికలో ప్రధాన యువతకు పెద్ద పీట వేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని కార్యవర్గ కూర్పులో అనుభవం ఉన్నవారికి, కొత్త వారికి ఎంపీ అరవింద్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ ఎంపికలో ఎంపీ అరవింద్ సూచనలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం స్థానికి సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సంఖ్యలో స్థానాలను గెలుచుకోవడంతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, బల్దియాలపై జెండా ఎగురవేసేందుకే కొత్త కమిటీని ఎంపిక చేసినట్టు కనబడుతుంది.
