29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

దొడ్డుకొమురయ్య నగర్ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కార్పొరేషన్ కార్యాలయం ఎదుట  సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ   : రెండు దశాబ్ధాలకు పైగా దొడ్డుకొమురయ్య నగర్ లో నివసిస్తున్న ప్రజలకు మౌళిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వెంటనే మౌళిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దొడ్డు కొమురయ్య నగర్ లో నిరుపేదలకు సొంత ఇంటి కల గానే మిగిలిపోయిందని,  గత ప్రభుత్వాలు ఓటు హక్కు కార్డు ఆధార కార్డు రేషన్ కార్డు దొడ్డి కొమురయ్య నగర్ కాలనీ పేరు మీద చేసి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిసి రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి కనెక్షన్ లు  మంజూరు చేసి ఇప్పుడు మీరు నివసిస్తున్నా ఏరియా ఫారెస్ట్ కి సంబంధించి ఖాళీ చేయాలని అధికారులు ప్రజల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇంటి టాక్స్ లు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్  చేశారు. లేదంటే రానున్న కాలంలో దొడ్డి కొమరయ్య నగర వాసులకు అన్ని రకాల హక్కులు కల్పించేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు రాములు, ఎన్.నరసయ్య,  నగర కమిటీ సభ్యులు  బి.అనసూయ,అనిత,  పార్టీ  సభ్యులు  యశోద లక్ష్మీబాయి,మంగళ్ బాయ్, రమాబాయి, సంగీత  పంచ పూల, దీక్షిత బస్తీ వాసులు పాల్గొన్నారు.

More articles

Latest article