27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎనిమిది గంటల రెస్య్కూ ఆపరేషన్

Must read

📰 Generate e-Paper Clip

  • 656 గొర్రెలు, కాపరులను, రైతులను కాపాడిన అధికారులు

 

బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షేట్లూరు గ్రామంలో భారీ వరద నీటిలో చిక్కుకుపోయిన  నలుగురుని, 656 గొర్రెలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  పర్యవేక్షణలో  అధికార యంత్రాంగం రక్షించింది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో మంజీరానది నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామానికి చెందిన ఒక రైతు, గుండెకల్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ,జుక్కల్ మండలం  బస్సాపూర్ కు చెందిన ఒక గొర్రెల కాపరి  మొత్తం 4 గురు , 656 కి పైగా గొర్రెలు వాగులోని చిన్నదీవిలో చిక్కుకుపోయారని సమాచారం అందడంతో  కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్  తక్షణమే స్పందించి సంబంధిత శాఖలకు అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మద్నూర్ ఫైర్‌స్టేషన్ 7గురు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగా వెంటనే రెండు పడవలతో 14మంది ఎస్ డిఆర్ఎఫ్ బృందం, అలాగే  కె. వినోద్‌కుమార్ ( ఆర్ఎస్ఐ) నేతృత్వంలోని 24మంది సభ్యుల 7వ బెటాలియన్ ఎస్ డిఆర్ఎఫ్ బృందం, కామారెడ్డి నుండి 4మంది ఫైర్‌స్టేషన్ బృందం రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. అదనంగా డీఎస్పీ బాన్స్వాడ సీఐ బిచ్కుంద ఎస్ఐ బిచ్కుంద నాయకత్వంలోని 20మంది పోలీసు సిబ్బంది రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి , బిచ్కుంద రెవెన్యూ బృందం (18మంది) పర్యవేక్షణలో ఈ రక్షణ చర్య విజయవంతంగా అమలుచేయబడింది. ఈ ఆపరేషన్‌ను కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి  ఎస్. సందన్న, నిజామాబాద్ జిల్లా అజ్ఞాపక  అధికారి టి. పరమేశ్వర్ సంయుక్తంగా నడిపించారు. మొదటగా ముగ్గురు గొర్రెల కాపరులను రక్షించి మానవ ప్రాణాలను కాపాడి వాగులోని మరో చిన్న దీవిలో చిక్కుకుపోయిన రైతును కూడా విజయవంతంగా రక్షించారు. ఎనిమిది గంటలకు పైగా కొనసాగిన ఈ భారీ రిస్క్యూ చర్యలో మొత్తం 4 మంది వ్యక్తులు మరియు 656 గొర్రెలు సురక్షితంగా రక్షించబడ్డారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి  క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొని  ఎలాంటి ప్రాణం నష్టం జరగకుండా  చూశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ భారీ రక్షణ చర్య మానవ ప్రాణాలు మరియు పశువుల రక్షణలో జిల్లా పరిపాలన యంత్రాంగం మరియు అన్ని శాఖలు వేగవంతమైన స్పందన సమన్వయం కట్టుబాటుకు నిదర్శనంగా నిలిచిందని తెలిపారు.  ఈ రిస్క్యూలో పాల్గొన్న  అందరినీ అభినందిస్తూ వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టే వరకు  జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లరాదని, ప్రమాదకరంగా నీరు ప్రవహించే లోతట్టు బ్రిడ్జిలు కాజ్వేల పైనుండి ప్రయాణాలు చేయరాదని, పశువులు, గొర్రెలను తీసుకొని లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరమైన వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పిల్లలు ఈత కొరకు నీటి వనరుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు, ఎలాంటి సమస్య వచ్చిన  అధికారులను ,కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468-220069 ను సంప్రదించాలని సూచించారు.

Eight-hour rescue operation

More articles

Latest article