- డిసిఈబి సెక్రటరీ బి.సీతయ్య
సారంగపూర్, బతుకమ్మ : విద్యార్థులు చదువులో రాణించడానికి క్రీడల్లో నైపుణ్యం కూడా దోహదపడుతుందని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యార్థులు యువత ఆటలలో చదువులో సవ్యసాచులుగా రాణించాలని డి సి ఈ బి సెక్రటరీ బి. సీతయ్య అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగాపూర్ ను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల క్రీడా విభాగానికి రెండు ఫుట్బాల్లు, రెండు వాలీబాల్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మేధావులు సమర్ధులైన ఉపాధ్యాయులు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ల్యాబ్లు ఐఎఫ్బి ఇలాంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయని విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకొని రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, ఉపాధ్యాయులు గోపాల్, రాధాకృష్ణ, సాగర్, డాక్టర్ గంగాధర్, ఘనపురం దేవేందర్, సుజాత, శ్రీలత, అనిత, స్వరూప, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణంరాజు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పక్షాన డిసిఈబి సెక్రెటరీ సీతయ్యను సత్కరించారు.

