26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా ఇంచార్జి తిరుపతి

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి అన్నారు. బుధవారం  నగరంలోని కంఠేశ్వర్ లో 8 డివిజన్ లకు సంబంధించి అలాగే డివిజన్ నెంబర్ 11 లో 12  డివిజన్లకు సంబంధించిన నగర కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తిరుపతి కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎస్టి కమిషన్ చైర్మన్ జిల్లా ఇన్చార్జి తిరుపతి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నుడా చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత డివిజన్ లలో ఆశవాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నాయకులు రాంభూపాల్, నరాల రత్నాకర్, మీసాల సుధాకర్, బొబ్బిలి రామకృష్ణ తదితరులున్నారు.

More articles

Latest article