నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాదుల, వారి గుమస్తాల సంక్షేమ నిధి టికెట్ ధరను పెంచుతు సర్క్యులర్ జారీ చేసింది. న్యాయవాదులు కోర్టులలో తమ సివిల్, క్రిమినల్ కేసులతో పాటు,ట్రిబ్యూనల్ లలో కక్షిదారుల తరపున వకాలత్, మెమో ఆఫ్ అప్పీయరెన్స్ కు సంక్షేమ నిధి టికెట్ ను తప్పనిసరిగా అతుకబెట్టి దాఖలు చేస్తారు. ప్రస్తుతం దాని ధర వంద రూపాయలుగా ఉంది. దానిని రెండు వందల యాభై రూపాయలకు పెంచుతు బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర జూన్ 9 నుండి అమలులోకి రానున్నదని సదరు సర్క్యులర్ లో పేర్కొన్నారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 1987సెక్షన్ 12 ప్రకారం ధరను పెంచడం జరిగిందని బార్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి నాగలక్ష్మి సర్క్యులర్ లో తెలిపారు. 100 రూపాయల వెల్ఫేర్ టికెట్ ధర జూన్ 9 వరకు కొనసాగుతుందని, ఆ తేదీ తరువాత ఒకవేళ మిగిలి ఉంటే 50రూపాయల వెల్ఫేర్ టికెట్ ను అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. 250 టికెట్ ను వకాలత్ లకు అతుకబెట్టాలని కోరారు. అంతలోపు ముద్రించిన 250 వెల్ఫేర్ టికెట్స్ అన్ని బార్ అసోసియేషన్ లలో అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని అన్నారు.
