24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఆట, పాటలతో అంగవాడీల్లో పిల్లలకు విద్యా భోధన

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ: ముచ్చటగా మూడు సంవత్సరాలు నిండిన బాల బాలికలకు ప్రాయానికి అనుగుణంగా ఆటపాట లతో ప్రభుత్వ అంగన్ వాడి కేంద్రాల్లో విద్యాభోధన చేయడం జరుగుతుందని ఎంపీడీఓ. గంగుల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బెజ్జోరా గ్రామంలో ఐ సీ డీ ఎస్ ఆధ్వర్యంలో సీ డీ పీ ఓ నేత్రుత్వంలో నిర్వహించిన అమ్మ మాట… అంగన్ వాడి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పిల్లలు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల వారి వారి మూడ్ ను బట్టి ఆట కావాలంటే ఆట ద్వారా, పాట ఇష్టపడితే పాటల ద్వారా, నిద్రొస్తే నిద్రపుచ్చుతు, ఏడస్తే ఓదార్చుతు భోధన చేయడం  జరుగుతుందన్నారు. పిల్లలకు రోజు స్కూల్ కు వెళ్లాలన్న కోరిక కలిగేలా చాకలేట్లు, బిస్కీట్లు ఇస్తూ, రోజు పోషక ఆహార పదార్థాలను అందిస్తూ భోధన చేయడం జరుగుతుందన్నారు.అనంతరం గ్రామంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఐ సీ డీ ఎస్. సీడీపీఓ స్వర్ణలత, సూపెర్వైజర్ శారదాపిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Education for children in Angawadis through games and songs

More articles

Latest article