మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్, మాక్లూర్,మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల మూడు నెలలు పెండింగ్ జీతాలు వెంటనే చెలించాలని డిమాండ్ చేశారు. 2016 సంవత్సరంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆ తీర్పును వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారికి నాలుగు నెలల నుండి జీతాలు రాక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో, గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు ఓకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 60 ప్రకారం16,500 చెల్లిస్తుంటే గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం 9500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు అన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో అనుభవం లేని పనులు చేయించడం వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. కార్యక్రమంలోఎం సత్తమ్మ, కార్మిక సంఘం నాయకురాలు జిల్లా నాయకురాలు, మండల నాయకులు. దశరథ్. లక్ష్మణ్. మజీద్. నరసయ్య. నాగమణి. ముత్తెక్క. రాజు. సువర్ణ. గజానంద్. వివిధ గ్రామాల నుంచి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
