రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బందిని పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు వెళుతున్న సిబ్బందిని ఉదయం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా నిర్వహించే ఈ ధర్నాను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని అరెస్టులు చేయించడం బాధాకరమని పంచాయతీ సిబ్బంది వాపోయారు. అరెస్టు అయిన వారిలో వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.