25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతి ఉద్యోగి బాధ్యత టీజిఓస్ దే

Must read

📰 Generate e-Paper Clip

  • టీజిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు

 

నిజామాబాద్ బతుకమ్మ : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే కీలకమైన ఉద్యోగులలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ లోని ప్రతి ఉద్యోగీ బాధ్యతలు టీజీవోదేనని రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన  గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్  కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా ఎంపికైన నిజామాబాదు టీజీవోస్ అధ్యక్షుడు ఆకుల కిషన్, జిల్లా కార్యదర్శి అమృత కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డి లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యలను ఎన్నికల కోడ్ తరువాత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు.. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ , టీజీఓ ఏస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలియజేశారు. ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొంటారు కానీ ఓటు హక్కు వినియోగించుకోరు అనే అపవాదును తొలగించుకొనుటకు తప్పకుండా అందరూ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును 100% వినియోగించుకోవాలని రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,  తిరుపతి రావు, దేవిసింగ్, దండు స్వామి, రామస్వామి, తదితర జిల్లా గెజిటెడ్ అధికారులు అందరూ పాల్గొన్నారు.

More articles

Latest article