26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గెలిపిస్తే అణగారిన వర్గాల గొంతుకనైత

Must read

📰 Generate e-Paper Clip

  • ధర్మ సమాజ్ పార్టీ  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అణాగారిన వర్గాల బిడ్డగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, వెనుక బడిన జాతుల ఉన్నతి కోసం ఉద్యమిస్తున్నానని పట్ట భద్రులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎం.ఎల్.సి అభ్యర్థి మంద జ్యోతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో వేల కొట్లున్న అగ్రవర్ణాలు పోటీ చేస్తున్నాయని, కాంగ్రెస్ బిజెపి లాంటి పార్టీలు వేల కోట్లు ఉన్నటువంటి నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని, వారి వల్ల సమాజానికి మేలు జరగదు అన్నారు. ప్రజాస్వామికంగా పీడిత బాధ్యత వర్గాలకు న్యాయం జరగాలంటే అనగారిన వర్గాల ప్రాతినిథ్యం కావాలని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఎంతో సేవలందించిన, పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తున్న నాకు మరింతగా మద్దతుగా నిలిచి గెలిపించాల్సిందిగా వేడుకున్నారు. విద్య వైద్యం నాణ్యతలేమిటో ప్రజలు మరింత పేదరికం బారిన పడుతున్నారని, అగ్రకులాలకు ఓటు అమ్ముడు పోకుండా ఓటు చైతన్యంతో పట్టబద్రులు విద్యావంతులు మేధావులు ఆలోచించి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ 9 న మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాన్షిరాముల ఆలోచనలతో జరుగుతున్న ఉద్యమానికి మీ ఓటు ద్వారా మద్దతు పలకాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలు చైతన్యవంతంగా ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్, బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి కోర్టును అభ్యర్థించారు. అనంతరం జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యావంతులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంబేద్కర్ సంఘాల జేఏసీ నాయకులు పుష్ప కు వచ్చాయి ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుమన్, ప్రేమ్, జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్, మురళి, మండలాల అధ్యక్షులు ఉమేష్, నిశాంత్, గంగాధర్, మహేష్, కిషన్, ముఖ్య నాయకులు ఉన్నారు.

More articles

Latest article