ప్రతి ఉద్యోగి బాధ్యత టీజిఓస్ దే
టీజిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు నిజామాబాద్ బతుకమ్మ : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే కీలకమైన ఉద్యోగులలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ లోని ప్రతి ఉద్యోగీ బాధ్యతలు టీజీవోదేనని రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా ఎంపికైన నిజామాబాదు...